కరోన మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలకు అండగా నిలుస్తూ పలువురు దాతలు సేవలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం బంద్రేపల్లిలో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీలకు మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సతీమణి సునీతరఘువీర్ రాగి సంగటిని అందించారు. వీటితోపాటు మాస్కులను పంపిణీ చేశారు. భౌతిక దూరం పాటిస్తూ ఉపాధి పనులు చేపట్టాలని సూచించారు. పట్టణంలోని వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ వారు నియోజకవర్గంలోని 108 వాహనాల సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ అందించారు. భాజపా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన కరోన బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లను అందించారు.
అనంతపురం జిల్లాలో పేదలకు అండగా పలువురు దాతలు - అనంతపురం జిల్లాలో పేదలకు ఆహారం పంపిణీ వార్తలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలువురు సేవాభావాన్ని చాటుతున్నారు. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ నేత సతీమణి, వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్, భాజపా కిసాన్ మోర్చా నాయకులు పలువురికి సహాయం చేశారు.
అనంతపురం జిల్లాలో పేదలకు అండగా పలువురు దాతలు