అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఓ మహిళ ప్రతి వీధి తిరుగుతూ గాడిద పాలు విక్రయిస్తోంది. తనతో పాటు గాడిదను తీసుకుని వీధి వీధి తిరుగుతూ ఒక్కో చంటిపాపకు సుమారు 20 మిల్లీ లీటర్ల మేర పాలను పితికి 50 రూపాయలకు అమ్ముతోంది. ఈ లెక్కన లీటర్ పాలు అమ్మితే 2500 రూపాయలు సమకూరుతున్నాయి.
తక్కువ కొవ్వు శాతం..
గాడిద పాలల్లో కొవ్వు శాతం తక్కువ, విటమిన్లు ఎక్కువ ఉంటాయని.. ఇవి అనేక జబ్బులకు ఔషధమని ఆమె పేర్కొన్నారు. గాడిద పాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి అధికంగా ఉత్పతవుతుందని చెప్పారు.