అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామ మందిరం నిర్మాణానికి.. సమాజమంతా భాగస్వామ్యమవ్వాలని.. రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు కోరారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో వారు సమావేశమయ్యారు. పట్టణంలోని స్థానిక కోదండ పట్టాభిరామ మందిరంలో నిధి సమర్పణ అభియాన్ కరపత్రాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి 31 తేదీ వరకు రామ సేవకులుతో పాటు ప్రజలందరూ రామమందిర నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు.
అయోధ్య రామమందిర నిర్మాణానికి నిధుల సేకరణ - అయోధ్యలో రామమందిర నిర్మాణానికి నిధుల సేకరణ
అయోధ్యలో నిర్మించ తలపెట్టిన నిర్మాణానికి సమాజమంతా సహకరించాలని.. రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అన్నారు. అనంతపురంలో నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
రామమందిర నిర్మాణానికి నిధుల సేకరణ