అనంతపురం నగరంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆ చిన్నారులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మున్నానగర్ కు చెందిన ఐదేళ్ల చిన్నారి ఆడుకోవడానికి బయటికి వస్తే కుక్కలు దాడి చేశాయని... ఇందులో ఒకటి పిచ్చికుక్క ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మరో ఘటనలో బోయ వీధికి చెందిన బాలుడి పైన శునాకలు దాడి చేసినట్లు బాలుడి తల్లి తెలిపింది.
కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు - anantapur updates
అనంతపురంలో రెండు వేర్వేరు చోట్ల చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. శునకాల బెడద ఎక్కువగా ఉందని నిత్యం మున్సిపాలిటీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
![కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు Dogs attacked and seriously injured children](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9449201-510-9449201-1604642658250.jpg)
కుక్కల దాడిలో గాయపడిన చిన్నారులు.
నగరంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని నిత్యం మున్సిపాలిటీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి నగరంలో ఉన్న కుక్కలను తరలించాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండీ...చిత్తూరు జిల్లాలో 187 మంది ఉపాధ్యాయులకు కరోనా