దాహార్తిని తీర్చుకునేందుకు జనారణ్యంలోకి వచ్చిన జింకలపై కుక్కలు దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటు చేసుకుంది. స్థానిక మార్కెట్ యార్డ్ సమీపంలోని అడవుల నుంచి తెల్లవారుజామున రెండు జింకలు నీటి కోసం ఇళ్ల మధ్యకు వచ్చాయి. వాటిని చూసిన కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమివేశారు. ఒక జింక పారిపోగా మరో జింకకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది... గాయపడిన జింకకు పశు వైద్యుడితో చికిత్స అందించారు. అనంతరం దానిని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
దాహం వేసి వచ్చాయి... దాడికి గురయ్యాయి!
అడవిలో ఉండే జింకలకు దాహం వేసి జనారణ్యంలోకి వచ్చాయి. అటూ, ఇటూ గంతులేస్తూ గ్రామసింహాల కంటపడ్డాయి. అంతే కుక్కలు మూకుమ్మడిగా జింకలపై దాడి చేశాయి. ఈ ఘటనలో ఒక జింక గాయపడగా మరో జింక తప్పించుకొని అడవిలోకి పరుగు తీసింది.
dogs-attack-on-deers-in-uravakonda