అమ్మ ప్రేమకు జాతులు అడ్డురావని ఓ కుక్క నిరూపించింది. సాధారణగా పందులను చూస్తే కుక్క తరుముంది. ఇక కుక్క వచ్చిందంటే పంది తన పిల్లలను కాపాడుకునేందుకు ఆరాటపడిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం ఓ కుక్క పంది పిల్లలకు పాలిస్తూ..అమ్మతనాన్ని చాటింది.
మాతృత్వం చాటిన శునకం - dog breastfeeds news in gutti
కుక్క.. పంది ఇవి రెండు జాతి వైరం ఉన్న జంతువులు. పందిని చూస్తే కుక్క వెంబడిస్తుంది. కానీ ఆకలితో ఉన్న పంది పిల్లలకు.. ఓ కుక్క పాలిచ్చి మాతృ హృదయాన్ని చాటుకుంటోంది.
![మాతృత్వం చాటిన శునకం dog breastfeeds to pigchildren in gutti](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7308340-533-7308340-1590161180386.jpg)
అనంతపురం జిల్లా గుత్తిలో ఆర్ఎస్లోని హోరబ్ కాంపౌండులో శునకం వద్దకు పంది పిల్లలు వచ్చి పాలు తాగుతున్నాయి. వీధిలో ఆ కుక్క కనిపించగానే.. ఆ వరాహాలు పోటాపోటీగా పాలు తాగుతాయి. కుక్క కూడా వాటిని ఏమనకుండా తన సొంత బిడ్డల్లా పాలిస్తోంది. ఇలా కేవలం ఒక రోజు మాత్రమే కాదు.. గత నెల రోజులుగా ఇలానే జరుగుతోందని కాలనీ వాసులు అంటున్నారు. అంతే కాదు. కుక్క కూడా వరాహాలను వెంట వేసుకొని తిరుగుతూ ఉంటుందని.. వాటి పిల్లలకు ఆకలి వేసినప్పుడల్లా పాలిచ్చి ఆకలి తీరుస్తుందని స్థానికులు చెబుతున్నారు.
ఇదీచూడండి.కూలిన ఇంటి గోడ... పురాతన నాణేలు లభ్యం!