అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ పరిధిలోని 9వ వార్డులో పిచ్చికుక్క దాడిలో నాలుగేళ్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఇంటి సమీపంలో పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా పిచ్చికుక్క వారిపై దాడి చేసింది. కుక్కకు భయపడి ఇతర పిల్లలు పారిపోగా..అక్కడే ఉన్న నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసింది. చిన్నారిపై పిచ్చికుక్క పలుచోట్ల దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గుర్తించిన కాలనీవాసులు కుక్కను తరిమి కొట్టారు.
నాలుగేళ్ల చిన్నారిపై కుక్క దాడి.. తీవ్ర గాయాలు - మడకశిర ప్రభుత్వాసుపత్రి
సరదాగా ఆడుకుంటున్న పిల్లలపై ఓ పిచ్చికుక్క దాడి చేసింది. ఈ ఘటన అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ పరిధిలోని 9వ వార్డులో చోటుచేసుకుంది. దాడి జరిగిన సమయంలో పిల్లలందరూ పారిపోగా.. భయాందోళనకు గురైన నాలుగేళ్ల చిన్నారి అక్కడే ఉండిపోయింది. ఆ చిన్నారిపై దాడి చేసిన కుక్కు.. పాపను తీవ్రంగా గాయపరిచింది. చికిత్స కోసం చిన్నారిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నాలుగేళ్ల చిన్నారిపై కుక్క దాడి
తీవ్ర రక్తస్రావంతో గాయాలైన చిన్నారిని మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం హిందూపురానికి తీసుకెళ్లాలని సూచించారు. పట్టణంలో కుక్కలు, పందులు పిల్లలపై దాడులు చేస్తున్నా.. అధికారులు వాటి నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి