ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈ నెలాఖరులో రైతులకు వేరుశనగ విత్తనాలు

By

Published : May 3, 2020, 10:54 AM IST

మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం వలస గ్రామంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, రైతుల నుంచి సేకరించిన వేరుశెనగ విత్తనాలను జిల్లా అగ్రికల్చర్ జేడీ హబీబ్ భాషా పరిశీలించారు. వేరుశనగ ఇచ్చిన రైతులకు డబ్బులు చేరాయా లేదో అని అడిగి తెలుసుకున్నారు.

examined peanut seeds
విత్తనాలను పరిశీలించిన జిల్లా అగ్రికల్చర్ జేడీ హబీబ్ భాషా

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం వలస గ్రామంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, రైతుల నుంచి సేకరించిన వేరుశనగ విత్తనాలను జిల్లా అగ్రికల్చర్ జేడీ హబీబ్ భాషా పరిశీలించారు. జిల్లాకు మూడు లక్షల 34 వేల క్వింటాళ్ల వేరుశనగ అవసరం ఉండగా రెండు లక్షల క్వింటాళ్లు సేకరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ నెలాఖరులో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తన వేరుశనగ కాయలను అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి పలువురు అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details