ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉన్నంతలో తోటి వారికి సాయం చేయండి' - అనంతపురంలో లాక్​డౌన్

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు, పలువురు నాయకులు ముందుకు వస్తున్నారు. అనంతపురం జిల్లాలోని పలు మండల్లాలో వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు పేదలకు కూరగాయలను, నిత్యవసరాలను పంపిణీ చేశారు.

Distribution of Vegetables in anantapur
అనంతపురం జిల్లాలో కూరగాయల పంపిణీ

By

Published : Apr 6, 2020, 5:27 PM IST

అనంతపురం జిల్లా శింగనమల మండలం పెరవలి గ్రామంలో తెదేపా నాయకుడు మారుతి నాయుడు ఆధ్వర్యంలో 600 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంయస్. రాజు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు శింగనమల మండలం పెరవలి గ్రామంలో సరకుల పంపిణీని ప్రారంభించామన్నారు.

జిల్లాలోని తాడిపత్రి మండలం రమేష్ రెడ్డి కాలనీలోని 400 కుటుంబాలకు వైకాపా రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి తన సొంత ఖర్చులతో ఇంటింటికి 25 కేజీల బియ్యం, 30 కోడిగుడ్లు, కూరగాయలు, పండ్లు అందజేశారు. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమకు ఉన్నంతలో తోటి వారికి సాయం అందించాలని ఆయన కోరారు.

రాయదుర్గం పట్టణంలోని కూరగాయల మార్కెట్​ను, లక్ష్మీ బజార్, పాత బస్టాండ్ , వినాయక సర్కిల్, శాంతినగర్ ప్రాంతాలను డీఎస్పీ ఎం. వెంకటరమణ తనిఖీ చేశారు. పోలీసులు ప్రతిరోజు చేపడుతున్న చర్యలవల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు మీడియా డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా అలాంటిదేమీ లేదని తెలిపారు. దుకాణాల వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేయాలని వ్యాపారులకు సూచించామని డీఎస్పీ వివరించారు.

ఇదీ చూడండి:

దీపాలతో ఐక్యత చాటిన గ్రామస్థులు

ABOUT THE AUTHOR

...view details