తెలుగుదేశం పార్టీ రాప్తాడు నియోజకవర్గ ఇంచార్జి పరిటాల శ్రీరామ్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. రాప్తాడు మండలం ఎన్.బి.కె ఫ్యాన్స్ అసోసియేషన్ కల్యాణదుర్గం రోడ్డులోని భాగ్యనగర్ కాలనీలో కురుకుంట అంధుల ఆశ్రమంలో శానిటైజర్, మాస్కులు పంపిణీ చేశారు. గతంలో పరిటాల ట్రస్ట్ ద్వారా రక్తదాన శిబిరాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టే వారమని, ప్రస్తుతం కొవిడ్ నిబంధనలను అనుసరించి తక్కువ మందితో కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు.
పరిటాల శ్రీరామ్ పుట్టినరోజు.. మాస్కులు, శానిటైజర్లు పంపిణీ - masks and sanitizers Distribution latest news
పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. అంధుల ఆశ్రమంలో శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ప్రజాసేవలో ఆయన ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పరిటాల ట్రస్ట్ వారు పేర్కొన్నారు.

పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకలు