అర్హులైన వారందరికీ లాటరీ పద్ధతి ద్వారా ఇళ్ల స్థలాల పంపిణీ చేపడుతున్నామని కర్నూలు జిల్లా మద్దికేర తహసీల్దార్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. పట్టణంలోని కొండమ్మ బావి వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో.. అర్హులైన వారికి లాటరీ పద్ధతి ద్వారా ఇళ్ల స్థలాల ఎంపిక కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
మద్దికేరలో లాటరీ ద్వారా ఇళ్ల స్థలాల పంపిణీ - maddikera news today
కర్నూలు జిల్లా మద్దికేరలో లాటరీ ద్వారా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని తహసీల్దార్ ప్రారంభించారు. లబ్ధిదారులందరికీ ఈ పథకం వర్తింపజేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మద్దికేరలో లాటరీ ద్వారా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం
గ్రామంలోని 700 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు పూర్తి చేశామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీచదవండి.