ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొరివిపల్లి రైతు భరోసా కేంద్రంలో రైతులకు ఎరువుల పంపిణీ - అనంతపురం జిల్లా వార్తలు

అనంతపురం జిల్లా కొరివిపల్లిలో రైతులకు ఎరువుల పంపిణీ కార్యక్రమం జరిగింది. జిల్లా పాలనాధికారి గంధం చంద్రుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Distribution of fertilizer to farmers at Korivipalli raithu bharosa centre
కొరివిపల్లి రైతు భరోసా కేంద్రంలో రైతులకు ఎరువులు పంపిణీ

By

Published : Jun 26, 2020, 9:52 PM IST

అనంతపురం జిల్లా శింగనమల మండలం కొరివిపల్లి రైతు భరోసా కేంద్రంలో.. కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు.. తక్కువ ధరకు విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని నేతలు చెప్పారు. ఈ ఏర్పాట్లపై స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details