కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవ మరువలేనిదని అనంతపురం జిల్లా కమ్మసంఘం కార్యదర్శి సరిపూటి సూర్యనారాయణ అన్నారు. అనంతపురం నగరపాలక సంస్థలోని 500 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. నగరాన్ని శుభ్రం చేస్తూ నిరంతరం సైనికుల్లా పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సహాయం చేయటానికి దాతలు ముందుకు రావటం అభినందనీయమని డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు పేర్కొన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ - అనంతపురంలో కరోనా కేసు వివరాలు
అనంతపురం జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులకు కమ్మసంఘం కార్యదర్శి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. వారి సేవలు మరువలేనివని కొనియాడారు.

Distribution of essentials