అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడులో తెదేపా రంగాపురం తెలుగుయువత ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అన్నార్తులను ఆదుకునేందకు ఈ కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.
అనంతపురం జిల్లాలో అన్నార్తులకు నిత్యావసరాల పంపిణీ - lockdown effect on people
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ఈ నిబంధన కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి అవస్థను గమనించిన కొందరు దాతలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమ వంతు తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
అనంతపురం జిల్లాలో అన్నార్తులకు నిత్యావసరాల పంపిణీ