అనంతపురంలో పేద ప్రజలకు వడ్డెర్ల విభాగం నాయకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వడ్డెర కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవల్ల మురళి ఆధ్వర్యంలో దాదాపు 3,500 మందికి నిత్యావసరాలు అందజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఐదు వేల మంది పేద ప్రజలకు నిత్యావసరాలు అందించే విధంగా ప్రణాళిక చేపట్టామన్నారు. పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న పేదవాళ్లను గుర్తించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ - corona
లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పలువురు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అనంతపురంలో వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ
వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ
ఇదీ చదవండి.