ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

EXPIRED FOOD ITEMS: అంగన్‌వాడీ కేంద్రంలో కాలం చెల్లిన ఆహార పదార్థాల పంపిణీ - ANDHRAPRADESH NEWS

గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందించాల్సిన అంగన్‌వాడీ కేంద్రంలోనే కాలం చెల్లిన పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తే.. ఆ ఆహారం తీసుకున్న గర్భిణుల పరిస్థితి ఏంటి? అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని శేషాపురం గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం కాలం చెల్లిన, పురుగు పట్టిన పౌష్టికాహారం పంపిణీ చేయడం గమనించిన గర్భిణులు..కేంద్రం వద్దే ప్యాకెట్లను పడేసి వెళ్లిపోయారు.

atp_ex food
అంగన్‌వాడీ కేంద్రంలో కాలం చెల్లిన ఆహార పదార్థాల పంపిణీ

By

Published : Aug 13, 2021, 11:38 AM IST

అంగన్‌వాడీ కేంద్రంలో కాలం చెల్లిన, పురుగు పట్టిన పౌష్టికాహారం పంపిణీ చేయడంపై గర్భిణులు కార్యకర్తను నిలదీశారు. కాలం చెల్లినవి తింటే తమ ఆరోగ్య పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని శేషాపురం గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.

పౌష్టికాహారం తీసుకునేందుకు అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చిన గర్భిణులు కాలం చెల్లిన ప్యాకెట్లను గుర్తించారు. రాగి, జొన్నపిండి, అటుకులు, బెల్లం, బర్ఫీలు పురుగులు పడి ఉండడాన్ని చూసి.. కాలం చెల్లినవి అందిస్తున్నారని కార్యకర్తతో వాగ్వాదానికి దిగి.. కేంద్రం వద్దే ప్యాకెట్లను పడేసి వెళ్లిపోయారు.

సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌రెడ్డి కేంద్రానికి చేరుకుని ప్యాకెట్లను పరిశీలించి, కార్యకర్తను ప్రశ్నించారు. ఆగస్టు నెలకు సంబంధించి అందిన కిట్లలో కొన్ని కాలం చెల్లినవి, పాడైనవి ఉన్నాయని, ఆ రోజే గుర్తించి వాహన చోదకుడిని అడగగా మావద్ద ఉన్నవి ఇవేనంటూ కేంద్రంలో సరకు దించి వెళ్లిపోయారని అంగన్‌వాడీ కార్యకర్త లక్ష్మీదేవి తెలిపారు. దీనిపై ఐసీడీఎస్‌ కార్యాలయానికి సమాచారమిస్తానని చెప్పారు.

ఇదీ చదవండి:

దేశంలో మరో 40,120 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details