ఇటీవల ఓ యువతిని తుంగభద్ర కాలువలోకి తోసేసిన ఘటనలో.. రఘు అనే యువకుడిపై కేసు నమోదు చేసినట్లు దిశ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. డీఎస్పీ రమ్యతో పాటు ఆయన పాల్గొన్నారు. రఘు చేతిలో హత్యకు గురైన బాధితురాలి కుటుంబం ఫిర్యాదుతో.. ఎస్పీ సూచనల మేరకు ప్రాథమికంగా దిశ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ స్పష్టం చేశారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధారాలు దొరికిన వెంటనే మిగిలిన వారిపైనా కేసు నమోదు చేసి.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
యువతి హత్యకేసు నిందితుడిపై దిశ కేసు నమోదు - రఘు అనే హంతకుడిపై దిశ కేసు నమోదు
తుంగభద్ర కాలువలోకి గత వారం ఓ యువతిని తోసి హత్య చేశాడో వ్యక్తి. ఈ ఘటనలో రఘు అనే యువకుడిపై దిశ కేసు నమోదు చేసినట్లు.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని దిశ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.
![యువతి హత్యకేసు నిందితుడిపై దిశ కేసు నమోదు kalyanadurgam dsp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9688716-1059-9688716-1606496795762.jpg)
వివరాలు వెల్లడిస్తున్న కళ్యాణదుర్గం డీఎస్పీ