అనంతపురం నగరానికి తాగునీటి సమస్య లేనప్పటికీ, మురికి నీరు తాగాల్సి వస్తోంది. గతంలో కొన్ని కాలనీల్లో తాగునీటి పైపులైనులోకి మురుగునీరు వెళ్లి ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం నగరమంతా ఇదే పరిస్థితి. వారం రోజులుగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చివరకు కలెక్టర్ బంగ్లాకే మురికి నీరు సరఫరా అయ్యేసరికి కదిలింది యంత్రాంగం. నగరానికి సరఫరా అవుతున్న కుళాయి నీటిని ఫిల్టర్ చేసే ప్రాంత పరిశీలనకు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ సత్యనారాయణ కదిలారు. కూడేరు మండలంలోని ముద్దలాపురం ఫిల్టర్ బెట్లు చూశారు. పీఏబీఆర్ జలాశయం నుంచి మురికిగా వస్తున్న నీటిని శుద్ధి చేస్తున్నప్పటికీ... నగరంలోని కులాయిలకు వచ్చే నీరు మురికిగా ఎందుకు ఉందని ఆరా తీశారు.
నీటి నిల్వ ట్యాంకుల నుంచే మురికి వస్తోందని తెలిసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని కలెక్టర్ వామపక్షనేతలు ఫిర్యాదు చేశారు.
సిబ్బంది కొరతతోనే సమస్యలు వస్తున్నాయన్న కమిషనర్ ప్రశాంతి... తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నగరపాలక సంస్థలో రహదారులకు మరమ్మతు చేయాలని.. మురుగునీటి పారుదల, చెత్త తొలగింపుపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆదేశించారు.
కలెక్టర్ బంగ్లాకు మురికి నీరు... పరుగులెత్తిన యంత్రాంగం... - కలెక్టర్ సత్యనారాయణ
అనంతపురం నగర ప్రజలకు మురికినీరే తాగునీరైంది. కుళాయిల్లోనూ మురికి నీరు వస్తుందన్న పట్టించుకున్న వారే లేరు. కలెక్టర్ బంగ్లాకు సైతం ఆ నీరే వెళ్లేసరికి అంతా రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ సత్యనారాయణ, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రశాంతి నేరుగా నీటి శుద్ధి చేస్తున్న బావుల వద్ద ఆకస్మిక తనిఖీ చేపట్టారు.
కలెక్టర్ బంగ్లాకు మురికి నీరు... పరుగులెత్తిన యంత్రాంగం...