ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వజ్రకరూరులో వజ్రం దొరికింది! - latest news of vajrakaroor

అనంతపురం జిల్లా వజ్రకరూరులో వర్షాలు వచ్చాయంటే వజ్రాల వేట మొదలైనట్లే. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం వచ్చి ఇక్కడి పొలాల్లో వజ్రాలకోసం వెతుకులాట మొదలెడతారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తికి వజ్రం దొరికింది. వ్యాపారికి విక్రయించగా లక్షల్లో సొమ్ము వచ్చినట్లు స్థానికులు తెలిపారు

diamond found in anantapur dst vajrakaroor
diamond found in anantapur dst vajrakaroor

By

Published : Jul 16, 2020, 2:51 PM IST

అనంతపురం జిల్లా వజ్రకరూరు పొలాల్లో ఓ వ్యక్తికి విలువైన వజ్రం లభ్యమైంది. దొరికిన ఆ వజ్రాన్ని ఓ వ్యాపారి రూ.8 లక్షల నగదుతో పాటు 6 తులాల బంగారం ఇచ్చి ఆ వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. వజ్రకరూరు పొలాల్లో చాలా ఏళ్లుగా వజ్రాలు లభిస్తున్నాయి.

ప్రతి ఏటా వర్షాలు కురిశాయంటే చాలు జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకుని పొలాల్లో వజ్రాలను వెతుకుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. రెండు రోజులుగా కొందరు ఇలాగే వెతుకుతున్న క్రమంలోనే వజ్రం లభ్యమైనట్టు స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details