ముంబైలో అంబేడ్కర్ రాజగృహంపై దాడిని ఖండిస్తూ అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో డీహెచ్ఎమ్ఎస్ నాయకుల ఆందోళన చేపట్టారు. అంబేడ్కర్ కూడలి వద్ద తమ నిరసన తెలిపారు.
దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డీహెచ్ఎమ్ఎస్ వ్యవస్థాపకుడు హనుమంతు డిమాండ్ చేశారు. సీబీసీఐడీతో విచారణ జరిపి కుట్ర వెనుక ఉన్నవారిని శిక్షించాలన్నారు.