అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో అంబేడ్కర్ విగ్రహానికి ఆనుకొని ఉన్న ఇనుప మెట్ల స్టాండ్‌ను గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో స్టాండ్ పక్కకు వాలింది. దీన్ని గుర్తించిన డీహెచ్‌పీఎస్ వ్యవస్థాపకుడు హనుమంతు, అతని సహచరులు జేసీబీతో తిరిగి దాన్ని యథాస్థానంలో నిలబెట్టారు. దీనికి కారకులైన వారిని వెంటనే పట్టుకొని శిక్షించాలని పోలీసులకు, మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు.
పట్టణంలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయండి
మడకశిర పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీహెచ్‌పీఎస్ డిమాండ్ చేసింది. నిఘా కెమెరాలు పనిచేయకపోవటం వల్ల పలు ప్రమాదాల కారణమవుతున్న వాహనాల ఆచూకీ తెలియటంలేదని వారు తెలిపారు.
మడకశిర పట్టణం
పట్టణంలో అమర్చిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో గతంలో ప్రమాదాలకు కారణమైన వాహనాల ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదని... ఇప్పుడు మహనీయుల విగ్రహాలకు ఇదే పరిస్థితి ఏర్పడిందని.. అధికారులు ఇప్పటికైనా స్పందించి సీసీ కెమెరాలు ఎల్లవేళలా పనిచేసేలా చొరవ చూపి... గురువారం జరిగిన ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డీహెచ్‌పీఎస్ వ్యవస్థాపకుడు హనుమంతు కోరారు.
ఇదీ చదవండి:రాజధాని రైతుల పిటిషన్‌పై విచారణ: సీఎం సహా.. రాజకీయ నేతలకు హైకోర్టు నోటీసులు