ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుట్టపర్తిలో మహా సమాధిని దర్శించుకున్న ధోనీ - dhoni in prashanthi nilayam

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పుట్టపర్తిలో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. అనంతరం సత్యసాయి సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిని సందర్శించారు.

dhoni in puttaparthi
మహా సమాధిని దర్శించుకున్న ధోనీ

By

Published : Feb 11, 2020, 11:52 AM IST

పుట్టపర్తిలో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న ధోనీ

అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి మహా సమాధిని భారత క్రికెటర్ ఎంఎస్ ధోనీ దర్శించుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న ధోనీకి సత్యసాయి ట్రస్టు సభ్యులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక కాన్యాయ్​లో ప్రశాంతి నిలయం చేరుకొని సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియంను పరిశీలించారు. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న సత్యసాయి సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిని సందర్శించారు. సత్యసాయి సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలను ట్రస్టు సభ్యులు ధోనీకి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాబా చేపట్టిన సేవలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయని ధోనీ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details