కొవిడ్ కారణంగా పరీక్షల నిర్వహణ ఆపివేయాలని నినాదాలు చేస్తూ... అనంతపురం ఎస్కేయూ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం విద్యార్థులపై కపట ప్రేమను చూపిస్తోందని విమర్శించారు. విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తూనే వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిగ్రీ పీజీ పరీక్షలు వెంటనే రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్ చేయాలని ఆందోళన చేపట్టారు. జిల్లా యంత్రాంగం తక్షణం చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో నిరసనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.