అనంతపురం జిల్లా గుంతకల్లులో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నూతన ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు గతంలో ఉన్న మధ్యాహ్న భోజన పథకం నిలిపివేసినందుకు నిరసనగా ధర్నా చేపట్టారు. వెనుకబడిన అనంతపురం లాంటి కరువుజిల్లాలో మధ్యాహ్న భోజన పథకం పేద విద్యార్థులకు చాలా అవసరమన్నారు. గ్రామీణ విద్యార్థులు కనీస భోజన వసతి లేక చదువుకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు.కావున ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగేలా చర్యలుతీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
మధ్యాహ్న భోజన పథకం కోసం ధర్నా
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేయడాన్ని నిరసిస్తూ..ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గుంతకల్లులో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
చేయాలని ధర్నా