వార్డెన్ విద్యార్థులకు భోజనాలు పెట్టకుండా మానసికంగా వేధిస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కలెక్టర్‌కు లేఖ రాసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ప్రిన్సిపల్ కూడా ఆమెకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించి, వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేక పోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
'గుత్తి గురుకుల పాఠశాల హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలి'
అసభ్య పదాలతో విద్యార్థులను వేధిస్తున్న అనంతపురం జిల్లా గుత్తి గురుకుల పాఠశాల వసతిగృహ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేశారు. హాస్టల్ వార్డెన్ అసభ్య పదజాలం, కులం పేరుతో దూషిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని పాఠశాల ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా చేశారు.
గురుకుల పాఠశాల వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని గుత్తిలో ఎస్ఎఫ్ఐ నాయకుల ధర్నా