ఈ రోజుతో పంటరుణాల గడవు ముగియడంతో వందలాది మంది రైతులు తమ రుణాలను రీషెడ్యూల్ చేసుకోలేదని నెలాఖరు దాకా ఆ సమయాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. బ్యాంకుకు తాళాలు వేయించి రోడ్డుకు అడ్డంగా కూర్చుని ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగంలోకి దిగి రైతులకు నచ్చజెప్పి అధికారులతో చర్చలు జరుపుతామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
తాళం వేయించారు... అనుకున్నది సాధించారు... - రైతుల ధర్నా
అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో తమ పంట రుణాల రీషెడ్యూల్ గడువు పెంచాలని రైతులు ఎస్బీఐ ముందు ధర్నా చేపట్టారు.
బ్యాంకు ఎదుట ధర్నాచేస్తున్న రైతులు