ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉసురు తీసిన లాక్ డౌన్.. చేనేత కార్మికుడు బలవన్మరణం - lockdown effect on dharmavaram weavers

లాక్ డౌన్... ఓ చేనేత కార్మికుడిని పొట్టన పెట్టుకుంది. మగ్గం మూతపడిన కారణంగా... ఉఫాధి లేక.. కుటుంబాన్ని పోషించలేక.. చేసిన అప్పులు తీర్చలేక అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుడు శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

dharmavaram weaver commit suicide due to lockdown
ధర్మవరంలో చేనేత కార్మికుడి ఆత్మహత్య

By

Published : May 9, 2020, 12:50 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా.. మగ్గం మూతపడి... ఉపాధి లేక కుటుంబ పోషణ కష్టమైన కారణంగానే బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. కూలి మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకునే శేఖర్ కు రూ. 3 లక్షలకు పైగా అప్పులు ఉన్నట్ల చెప్పారు.

40 రోజులుగా ఉపాధి లేక ఆదాయం లేకుండా పోయిందన్నారు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details