ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జలపాతాన్ని గుర్తుచేస్తున్న జలకళ - ధర్మవరం చెరువు

ధర్మవరం చెరువు వద్దకు యువకులు, చిన్నారులు పరుగులు పెడుతున్నారు. అక్కడి ఆహ్లాదకర వాతావరణంలో తామూ పాలుపంచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. జలపాతాన్ని తలపిస్తోన్న ప్రవాహంలో తడిసి ముద్దవ్వడానికి తొందరపడుతున్నారు.

dharmavaram pond
ధర్మవరం చెరువు

By

Published : Oct 23, 2020, 9:26 AM IST

ధర్మవరం చెరువు

భారీ వర్షాలకు అనంతపురం జిల్లా ధర్మవరం చెరువు జలకళను సంతరించుకుంది. చిత్రావతి నది నుంచి అధిక మొత్తంలో నీరు వచ్చి చేరుతోంది. చెరువుకు ఉన్న ఏడు మరువలు పొంగిపొర్లుతున్నాయి. నీటి పరవళ్లతో అక్కడి వాతావారణం ఆహ్లాదకరంగా మారింది.

మొదటి మరువ నుంచి ప్రవహిస్తున్న నీరు.. జలపాతాన్ని తలపిస్తోంది. ఆ సుందర దృశ్యాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామస్థులు తరలివస్తున్నారు. యువకులు, చిన్నారులు నీటిలో కేరింతలు కొడుతున్నారు. సందర్శకులు సెల్ఫీలు తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details