ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ కేర్ సెంటర్​లో మహిళ పట్ల ఎంఎన్​వో అసభ్య ప్రవర్తన - ధర్మవరం పాలిటెక్నిక్ కొవిడ్ కేర్ సెంటర్​లో కరోనా బాధితురాలి పట్ల అసభ్య ప్రవర్తన

అనంతపురం జిల్లా ధర్మవరంలోని పాలిటెక్నిక్ కొవిడ్ కేర్ సెంటర్​లో చికిత్స పొందుతున్న మహిళపై ఎంఎన్​వో లక్ష్మీ నరసింహులు వేధింపులకు పాల్పడ్డాడు. వైద్యం అందించే నెపంతో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

mno misbehaviour with corona patient in dharmavaram covid care center
కొవిడ్ కేర్ సెంటర్​లో మహిళ పట్ల ఎంఎన్​వో అసభ్య ప్రవర్తన

By

Published : May 16, 2021, 10:44 PM IST

కొవిడ్ కేర్ సెంటర్​లో చికిత్స పొందుతున్న ఓ మహిళపై.. అక్కడ వైద్య సేవలు అందిస్తున్న ఎంఎన్​వో అసభ్యకర రీతిలో ప్రవర్తించాడు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని పాలిటెక్నిక్ కొవిడ్ కేర్ సెంటర్​లో ఈ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన మహిళకు కరోనా నిర్ధరణ కావడంతో.. కుటుంబ సభ్యులు ఆమెను కొవిడ్ కేర్ సెంటర్​లో చేర్చారు.

ఇదీ చదవండి:కరోనాలో కొత్త లక్షణం.. 'కొవిడ్‌ టంగ్‌'

ఆమెకు చికిత్స అందించే నెపంతో.. గదిలో ఒంటరిగా ఉన్న మహిళను ఎంఎన్​వో లక్ష్మీ నరసింహులు తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇంఛార్జి ఎస్ఐ ప్రదీప్ సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:

మద్యం దుకాణాలు మూసివేయాలంటూ భాజపా నాయకుల నిరసన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details