ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్వచ్ఛ మున్సిపాలిటీల్లో ధర్మవరంను మొదటి స్థానంలో నిలుపుదాం' - ధర్మవరం వార్తలు

ధర్మవరం మున్సిపాలిటీని స్వచ్ఛతలో మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ లింగం నిర్మల కోరారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్​లో భాగంగా మున్సిపాలిటీలోని ప్రతీ వార్డును పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

dharmavaram first muncipal council meeting
ధర్మవరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం , ధర్మవరం మున్సిపాలిటీ వార్తలు

By

Published : Mar 28, 2021, 12:21 PM IST

ధర్మవరంలో కొత్త మున్సిపల్ పాలక వర్గం కొలుపుదీరిన తర్వాత ఛైర్ పర్సన్ లింగం నిర్మల అధ్యక్షతన మొట్టమొదటి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన ఛైర్ పర్సన్.. ధర్మవరంను స్వచ్ఛ మున్సిపాలిటీల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు, ప్రజలు కృషి చేయాలన్నారు.

క్లీన్ ఆంధ్రప్రదేశ్​లో భాగంగా ప్రతీ వార్డును పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశానికి హాజరైన కౌన్సిలర్లు ఆయా వార్డులకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించారు. సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేస్తానని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details