ధర్మవరం ఎమ్మెల్యే గన్‌మన్ కరోనాతో మృతి - covid cases in andhrapradesh
17:34 June 14
ధర్మవరం ఎమ్మెల్యే గన్‌మన్ కరోనాతో మృతి
తన అంగరక్షకుడిగా పనిచేసిన వ్యక్తికి కరోనా సోకి రెండురోజుల క్రితం మృతి చెందినట్లు అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆ వ్యక్తి నుంచి ఏడుగురికి వైరస్ సోకిందని ఎమ్మెల్యే చెప్పారు. లక్షణాలు కనిపించగానే పరీక్ష చేసుకుని ఉంటే ప్రమాదం తప్పేదన్నారు. అతడు పరీక్ష చేయించుకోకపోవటం వల్ల నలుగురు అంగరక్షకులు, ముగ్గురు సిబ్బంది కరోనా బారిన పడ్డారని ఆయన తెలిపారు. తనకు రెండుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా...నెగెటివ్‌గా తేలినట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: