ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది: పరిటాల శ్రీరామ్ - Municipal elections'

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్​చార్జి పరిటాల శ్రీరామ్.. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై విరుచుకుపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైకాపా పార్టీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు.

వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది: పరిటాల శ్రీరామ్
వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది: పరిటాల శ్రీరామ్

By

Published : Mar 8, 2021, 4:26 PM IST


మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైకాపా పార్టీకి ఓటమి భయం పట్టుకుందని ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్​చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. రెండేళ్లుగా అభివృద్ధి లేదని ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై విరుచుకుపడ్డారు. వట్టిచేతులతో ధర్మవరం వచ్చిన కేతిరెడ్డికి.. కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రజల సంక్షేమం పట్టణాభివృద్ధి పట్టించుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ.. ఎమ్మెల్యే ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్​ను, పరిటాల రవిని విమర్శించే స్థాయి ఎమ్మెల్యే కేతిరెడ్డికి లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details