ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దళితులపై దాడులు చేస్తున్న వారిపై కేసునమోదు చేయాలి' - కల్యాణదుర్గంలో దళిత నాయకుల ఆందోళన

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దళిత నాయకులు ఆందోళన చేశారు. దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Dhaloth leaders protest in kalyanasurgam ananthapuram district
'దళితులపై దాడులు చేస్తున్న వారిపై కేసు నమోదు చేయాలి'

By

Published : Jun 3, 2020, 5:24 PM IST

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, దాడులకు పాల్పడుతున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దళిత నాయకులు ఆందోళన చేశారు. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ ఉదంతం, ఆంధ్రా యూనివర్సిటీలో ఆచార్య ప్రేమానందంపై దాడి వంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కేసునమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీచదవండి.

సీఎస్​గా నీలం సాహ్ని పదవీకాలం 3 నెలలు పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details