ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి మహర్దశ.. అభివృద్ధి పనులకు శ్రీకారం - గుంతకల్లు ప్రభుత్వాసుపత్రి తాజా వార్తలు

అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిని 100 పడకలకు అప్​గ్రేడ్ చేస్తూ..ఆధునిక వసతులు, భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం రూ.13.35 కోట్లను కేటాయించింది. ఆసుపత్రి భవనాలకు నేడు గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి భూమిపూజ చేశారు.

గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి మహర్దశ
గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి మహర్దశ

By

Published : Dec 27, 2020, 9:12 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి మహార్దశ పట్టనుంది. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిని 100 పడకలకు అప్​గ్రేడ్ చేస్తూ..ఆధునిక వసతులు, భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం రూ.13.35 కోట్లను కేటాయించింది. ఆధునిక హంగులతో 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఆసుపత్రి భవనాలకు నేడు గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి భూమిపూజ చేశారు.

బడుగు బలహీన వర్గాలకు తోడ్పాటునందించేందుకు ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా విపత్కర సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. కోట్లాది రూపాయల విలువైన భూమిని ఆసుపత్రికి విరాళంగా ఇచ్చిన రాయ్ సాహెబ్ హంపయ్య కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details