ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది' - మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్న అంజద్ బాషా

మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో మైనార్టీల ఆత్మీయసభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్​ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

deputy cm amjad basha participates in ysrcp minority programme at anathapur
మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది: అంజద్ బాషా

By

Published : Jan 26, 2020, 2:57 PM IST

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్న ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మైనార్టీల పక్షపాతిగా ఉన్నారని ఉపముఖ్యమంత్రి అంజాద్​ బాషా తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని జరిగిన మైనార్టీ ఆత్మీయసభలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏడు నెలల కాలంలోనే 80 శాతం పూర్తి చేశామని అన్నారు. మూడు పంటలు పండే చోట రాజధానిని నిర్మించి అమరావతి ప్రాంత ప్రజలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆరోపించారు. నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల కలలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details