గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబెషన్ పూర్తి కావొస్తుండటంతో శాఖాపరమైన పరీక్షలకు ఏపీపీఎస్సీ సిద్ధమైంది. ఈమేరకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 28 నుంచి 30 వరకు 3 రోజులపాటు సచివాలయ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు నిర్వహించనున్నారు.
Appsc: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరీక్షలకు నోటిఫికేషన్ జారీ
15:52 September 10
departmental exams for village ward secretariats
ఈనెల 13 నుంచి 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఓటీపీఆర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సచివాలయ ఉద్యోగులకు సూచించింది. ఓటీపీఆర్ ద్వారా వచ్చే యూజర్ ఐడీతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించినట్టు స్పష్టం చేసింది.
మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తామని, అందులో 40 మార్కులు వస్తేనే ప్రొబెషనరీకి అర్హులుగా నిర్ధారించనున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది. మరోవైపు 2021 అక్టోబర్ 2వ తేదీ నాటికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటై రెండేళ్లు పూర్తి కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల మంది ఉద్యోగులకు ప్రొబెషన్ పూర్తి కావటంతో శాఖాపరమైన పరీక్షలను నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.
ఇదీ చదవండి