అంతరిక్ష పరిశోధనలపై అనంతపురం జిల్లా కదిరిలో అవగాహన ప్రదర్శన నిర్వహించారు. అంతర్జాతీయ అంతరిక్ష వారోత్సవాలలో భాగంగా సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం శ్రీహరికోట జైన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, డీఎస్పీ లాల్అహమ్మద్, శాస్త్రవేత్తలు ర్యాలీ ప్రారంభించారు. అంతరిక్ష పరిశోధనలపై సాధించిన విజయాలు, ఫలితాలను తెలియచేస్తూ ప్రదర్శన సాగింది. నినాదాలతో ప్లకార్డులను పట్టుకుని విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొన్నారు.
అంతరిక్ష పరిశోధనలపై అవగాహన ప్రదర్శన - కదిరిలో అంతర్జాతీయ అంతరిక్ష వారోత్సవాలు
అంతర్జాతీయ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా అంతరిక్ష పరిశోధనలపై.. అనంతపురం జిల్లా కదిరిలో అవగాహన ప్రదర్శన నిర్వహించారు.
అంతరిక్ష పరిశోధనలపై అవగాహన ప్రదర్శన
Last Updated : Oct 9, 2019, 2:11 PM IST