ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్డీటీ కాలనీలో అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్డీటీ కాలనీలో దాదాపు 70 మంది అక్రమంగా రిజర్వుడు స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్నారని, అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా కూడా స్పందించడం లేదని అందుకే అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో అక్రమ కట్టడాల కూల్చివేత
అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఆర్డీటీ కాలనీలో అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగింది. ఆర్డీటీ కాలనీలో దాదాపు 70 మంది అక్రమంగా రిజర్వుడు స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. దీనిపై అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో రెవెన్యూ, పురపాలిక అధికారులు అక్రమ కట్టడాలను జేసీబీలతో కూల్చివేశారు.
అక్రమ నిర్మాణాల తొలగింపు
ఇప్పటివరకు 20 కట్టడాలను తొలగించామని మరో రెండు రోజుల్లో అన్ని అక్రమ నిర్మాణాలని తొలగిస్తామని అధికారులు తెలిపారు. తమకు కొంత సమయం కావాలంటూ అడిగినా వినకుండా కూల్చివేస్తున్నారని రమణ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇది చదవండి: