అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని కూరగాయల మార్కెట్ ను మున్సిపల్ అధికారులు తొలగించారు. పోలీసు బందోబస్తు మధ్య ఎక్స్ కావేటర్ యంత్రాలతో తొలగించారు. ఈ ప్రాంతంలో కొత్తగా మార్కెట్ భవనాల నిర్మాణం కోసం.. పాత దుకాణాలను తొలగిస్తున్నారు. అయితే.. కొద్దిరోజులుగా వ్యాపారులు అడ్డుకుంటున్నారు.
కొత్త దుకాణాల కోసం.. రూ.10లక్షలు డిపాజిట్‌చేయాలని వ్యాపారులకు నోటీసులు జారీచేశారు. అయితే..రూ.10లక్షలు తాము ఇవ్వలేమనివ్యాపారులుఆందోళనకు దిగారు.కాగా.. రెండు దుకాణాలకు సంబంధించి హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో వాటిని మినహాంచి మార్కెట్లో ఉన్న 40కిపైగా కూరగాయల దుకాణాలను అధికారులు తొలగించారు. రేకుల షెడ్లు తొలగించడంతో వాటి కింద ఉన్న కూరగాయలు ధ్వంసం అయ్యాయి. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచే తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు.