అనంతపురం జిల్లా మడకశిర మండలం బుల్లసముద్రం గ్రామ సమీపంలో రోడ్డు దాటుతున్న జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న మడకశిర ఎస్సై శేషగిరి.. అపస్మారక స్థితిలో ఉన్న జింకను గమనించారు. గాయాలపాలైన జింకను పశు వైద్యశాలకు తరలించి వైద్యం అందించి.. దాని ప్రాణాలు కాపాడారు. గర్భంతో ఉన్న జింకను రక్షించిన ఎస్సైని ప్రజలు అభినందించారు.
గాయపడిన జింకను కాపాడిన మడకశిర ఎస్సై - madakashira latest news
గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయపడిన జింకకు అనంతపురం జిల్లా మడకశిర ఎస్సై వైద్యం అందించి.. ప్రాణాలు కాపాడాడు. గర్భంతో ఉన్న జింకను రక్షించిన ఎస్సైని ప్రజలు అభినందించారు.
జింకకు వైద్యం అందిస్తున్న అధికారులు