ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుక్కల దాడిలో జింక మృతి - పి.వెంకటంపల్లిలో మృతి చెందిన జింకను పరిశీలించిన అటవీ అధికారి

కుక్కల గుంపు దాడిలో జింక మరణించిన ఘటన.. అనంతపురం జిల్లా కంబదూరు మండలం పి.వెంకటంపల్లి సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న అటవీ అధికారి రామేశ్వరి.. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.

deer dead in p.venkatampalli, dogs killed deer at p.venkatampalli
పి.వెంకటంపల్లి వద్ద జింక మృతి, కుక్కల గుంపు దాడిలో జింక మృతి

By

Published : Apr 7, 2021, 10:22 PM IST

అనంతపురం జిల్లా కంబదూరు మండలం పి.వెంకటంపల్లి సమీపంలో జింక మృతి చెందింది. పాలూరు - వెంకటంపల్లి గ్రామాల మధ్యలో కుక్కల గుంపు జింకపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనలో.. అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ విషయంపై అటవీశాఖ అధికారులకు గ్రామస్థులు సమాచారం అందించారు. అటవీ అధికారి రామేశ్వరి జింకను పరిశీలించి చనిపోయినట్లు నిర్ధరించారు. పోస్టుమార్టం అనంతరం దహనం చేశారు.

ABOUT THE AUTHOR

...view details