అనంతపురం జిల్లా హిందూపురం వైద్యశాలలో మగశిశువు మరణం కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడంటూ తల్లిదండ్రులు బంధువులు ఆందోళనకు దిగారు. హిందూపురం పట్టణ పరిధిలోని కొట్నూరు గ్రామానికి చెందిన ముబీనాను ప్రసవం కోసం హిందూపురం మాతా శిశు వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డలను ఐసీయూలో ఉంచారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఐసీయూలో ఆక్సిజన్ సరఫరా చేసే ఎయిర్ కంప్రెషర్‌లోని కండెన్సర్ కాలిపోయింది. దీని వల్ల పొగ వ్యాపించి శిశువు ఉక్కిరి బిక్కిరై ప్రాణాలు కోల్పోయాడు. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ముబీనా బంధువులు ఆరోపించారు. అయితే మగశిశువు పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో ఉన్నాడని... అందువల్లే చనిపోయి ఉండవచ్చని ఆసుపత్రి సూపరింటెండెంట్ కేశవులు తెలిపారు.
కలెక్టర్ ఆగ్రహం