అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని నివాసాలు ఎత్తైన కొండను ఆనుకొని ఉన్నాయి. కొండపై చాలామంది ప్రజలు నివాసాలను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో వన్యప్రాణులు అడవులలో, కొండలలో ఆహారం కోసం, నీటి కోసం సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో మడకశిర పట్టణంలోని కొండపై ఎలుగుబంటి సంచరించింది. దాన్ని చూసిన చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. కొంత సమయం తర్వాత ప్రజల సమూహాన్ని చూసిన ఎలుగుబంటి అక్కడి నుంచి వెనుదిరిగింది. వన్యప్రాణులకు నీటి సౌకర్యం కల్పించి నివాసాల వద్దకు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
కొండపై ఎలుగుబంటి.. భయపడిన స్థానికులు - corona cases in anantapur dst
వన్యప్రాణులు ఆహారం లేక అడవి నుంచి బయటకు వస్తున్నాయి. అనంపురం జిల్లా మడకశిలో కొండలపై ఎలుగుబంటి జనసంచారంలోకి వచ్చింది. గమనించి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

dear came in village in anantapur dst madakasira