కెనడాలో ఆత్మహత్య చేసుకున్న యువకుడు ప్రణయ్ మృతదేహాన్ని అనంతపురానికి తీసుకువచ్చారు. కొవ్వూరు నగర్ వద్ద బంధువుల సందర్శన నిమిత్తం మృతదేహాన్ని ఉంచారు. ఓ యువతి మోసం చేసిందనే ప్రణయ్ ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రణయ్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతదేహానికి నార్పల మండలం గడ్డంనాగిపల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.
కెనడాలో రాష్ట్ర యువకుడి ఆత్మహత్య: అనంతపురానికి మృతదేహం
కెనడాలో ఆత్మహత్య చేసుకున్న రాష్ట్ర యువకుడు ప్రణయ్ మృతదేహం అనంతపురం చేరుకుంది. నార్పల మండలం గడ్డంనాగిపల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
అనంతపురం చేరుకున్న యువకుడి మృతదేహం