అనంతపురం సర్వజనాసుపత్రిలో దయనీయ ఘటన జరిగింది. 50 ఏళ్ల మహిళ కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరి ఎఫ్‌ఎం వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం ఆమె చనిపోయినట్లు పక్కన ఉన్న రోగులు గుర్తించారు. అల్పాహారం, మధ్యాహ్న భోజన ప్యాకెట్లు మంచం పక్కనే ఉన్నాయి. ఆమె మరణించినట్లు రాత్రి వరకూ వైద్య సిబ్బందికి తెలియదు. ఆర్డీటీ సంస్థ అందిస్తున్న భోజన ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు రాత్రి 8 గంటలప్పుడు శిక్షణ కలెక్టర్ సూర్య అక్కడికి చేరుకున్నారు. మహిళ చనిపోయిన విషయాన్ని రోగుల ద్వారా తెలుసుకున్నారు. నర్సు, హౌస్ సర్జన్లను పిలిపించి మాట్లాడారు. వారి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సిబ్బందిమృతదేహాన్ని మార్చురీకి తరలించారు. 2 రోజుల కిందట సకాలంలో వైద్యం అందక ధర్మవరానికి చెందిన రాజు అనేవ్యక్తి ఇదే ఆసుపత్రిలో చనిపోవడం గమనార్హం.
మృతదేహం 10 గంటలకుపైగా వార్డులోనే... - అనంతపురం తాజా వార్తలు
అనంతపురం సర్వజనాసుపత్రిలో దయనీయ ఘటన జరిగింది. 50 ఏళ్ల మహిళ కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరి ఎఫ్‌ఎం వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం ఆమె చనిపోయినట్లు పక్కన ఉన్న రోగులు గుర్తించారు...కానీ ఆమె మరణించినట్లు రాత్రి వరకూ వైద్య సిబ్బందికి తెలియదు.
మృతదేహం 10 గంటలకుపైగా వార్డులోనే