ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వే గేటు వద్ద వ్యక్తి మృతదేహం..మృతిపై అనుమానాలు - dead body found at kotipi railway gate

కోటిపి గ్రామ సమీపంలోని పొలాల్లో రమేష్​ బాబు(35) అనే వ్యక్తి మృతదేహం అనుమానాస్పద రీతిలో లభ్యమైంది. మృతుడు వ్యాపారంలో అప్పులు ఎక్కువ కావడం వల్ల బెంగళూరులో నివసిస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. గురువారం రైల్వేగేటు వద్ద కాలిన గాయాలతో ఆయన మృతదేహాన్ని గుర్తింారు

dead body found in kotipi railway gate in ananthapur district
టిపి రైల్వేగేటు వద్ద మృతదేహం

By

Published : Jul 17, 2020, 5:41 PM IST

అనంతపురం గ్రామీణ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కోటిపి వద్ద గురువారం అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. గోళ్లాపురం గ్రామానికి చెందిన రమేష్​ బాబు(35) వ్యాపారంలో అప్పులు ఎక్కువ కావడం వల్ల ఏడాది క్రితం కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులో ఉంటున్నాడు. గురువారం కోటిపి రైల్వేగేటు వద్ద ఆయన మృతదేహాన్ని కాలిన గాయాలతో గుర్తించారు. బుధవారం గోళ్లాపురం గ్రామస్థులతో రమేష్​బాబు, ఆయన భార్య మాట్లాడినట్లు సమాచారం. ఎవరైనా తీసుకొచ్చి పెట్రోల్​ పోసి నిప్పుపెట్టారా? ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details