కరోనా కారణంగా వెలవెలబోయిన లేపాక్షి ఆలయం దసరా పండుగను పురష్కరించుకొని భక్తులతో కిటకిటలాడింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు అనుమతించడంతో రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సందర్శకులు తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపం, సీతాదేవి పాదం, ఏడు శిరస్సు నాగలింగం వద్ద సందర్శకులు దర్శించుకున్నారు.
భక్తులతో కిటకిటలాడిన లేపాక్షి దేవాలయం - lepakshi temple latest news update
లేపాక్షి ఆలయంలో విజయదశమి పురస్కరించుకొని భక్తుల సందడి నెలకొంది. అనంతపురం జిల్లా లేపాక్షి మండల కేంద్రంలోని దుర్గా పాపనాశేశ్వర స్వామి ఆలయం.. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన శిల్ప కళల ఆలయంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.
భక్తులతో కళకళలాడిన లేపాక్షి దేవాలయం
ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని సందర్శకులు తెలిపారు. మహర్నవమి, విజయదశమి రెండూ ఒకే రోజు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వీరభద్ర స్వామిని, అమ్మవారిని దర్శంచుకున్నారని ఆలయ అర్చకులు లక్ష్మీ నరసింహశర్మ తెలిపారు.
ఇవీ చూడండి...