ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మసీదులోని హుండీ పగలగొట్టి చోరీ - మసీదులో హుండీ పగలగొట్టి చోరీ

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వరుస చోరీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మసీదులు, ఆలయాలకు సైతం రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ సక్రమంగా చేపట్టకపోవడంతోనే చోరీలు అధికమవుతున్నాయని మసీదు నిర్వాహకులు అంటున్నారు. నిన్న రాత్రి కోట ప్రాంతంలో ఉన్న మసీదులో దొంగలు పడి హుండీని పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు.

darga Hundi
darga Hundi

By

Published : Sep 3, 2020, 6:26 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కోట ప్రాంతంలో ఉన్న ముస్లింల ప్రార్థనా మందిరం ఫోర్ట్ గేట్ మసీదులో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. దొంగలు మసీదు ప్రహరీ గోడ పైనుంచి దూకి లోనికి ప్రవేశించారు. మసీదులోని హుండీని ఇనుప రాడ్​తో బద్దలుకొట్టారు. రాత్రి కావడం, వర్షం రావడంతో మసీదులో ఎవరూ లేకపోవడం గమనించిన దొంగలు హుండీలోని సొమ్ముతో పరారయ్యారు. హుండీలో ఎంత సొమ్ము ఉండవచ్చు అనేది తెలియాల్సి ఉంది. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాయదుర్గం పట్టణంలో వారంరోజుల క్రితం రెండు మసీదులలో దొంగలు పడి హుండీలను పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details