అనంతపురం జిల్లా పెనుకొండలోని బాబయ్య స్వామి దర్గా గంధం మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. గంధం మహోత్సవంలో భాగంగా ధర్గాను విద్యుత్ దీపాలతో ఆలంకరించారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక పూజలలో భాగంగా ఎండు కొబ్బరిని కాల్చి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దర్గాలో బాబాయ్య స్వామి సమాధిని దర్శించుకుని చక్కెర సదువింపులు నిర్వహించి..ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరోనా నేపథ్యంలో తక్కువ మంది భక్తులు ప్రార్థనలకు హాజరయ్యారు.
పెనుకొండలో ఘనంగా దర్గా గంధం వేడుకలు - అనంతపురం తాజా వార్తలు
అనంతపురం జిల్లా పెనుకొండలోని దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి గాంచిన బాబయ్య స్వామి దర్గా గంధం మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
పెనుకొండలో ఘనంగా దర్గా గంధం వేడుకలు