అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం,చుక్కలూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రోడ్డు పనుల కోసం తవ్విన గుంత ప్రమాదకరంగా మారింది.మూడు నెలలుగా పాఠశాల ఎదుటే యమగండంగా ఉన్న ఈ నీటి గుంత పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని పాఠశాల ఉపాధ్యాయులు,గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కల్వర్టు వద్ద సుమారు30అడుగుల వెడల్పు, 15అడుగుల లోతైన గుంత ఏర్పడింది.ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నీటి గుంతపై చర్యలకు దిగాలని ప్రధానోపాధ్యాయురాలు సర్వమంగల పేర్కొన్నారు.
పాఠశాల పక్కనే మురుగు నీరు..కాలు జారితే కన్నీరు - tadipathri latest nerws
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రోడ్డు పనుల కోసం తవ్విన గుంత ప్రమాదకరంగా మారింది. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికార్లు పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాడిపత్రి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా మారిన గుంత
TAGGED:
tadipathri latest nerws